ఆడ‌మ్ జంపాకు ఐసిసి మంద‌లింపు

Adam Zampa
Adam Zampa,

లండన్: ఐసీసీ నియమావళి అతిక్రమించినందుకు ఆస్ట్రేలియా బౌలర్‌ ఆడం జంపా శుక్రవారం మందలింపునకు గురయ్యాడు. ఈ మేరకు శుక్రవారం ఐసీసీ ‘ప్రపంచకప్‌లో వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆస్ట్రేలియా స్పిన్‌ బౌలర్‌ ఆడం జంపా ఐసీసీ నియమావళి ఒకటో నంబర్‌ నిబంధనను అతిక్రమించాడు’ అని పేర్కొంది. 

వెస్టిండీస్‌ ఇన్నింగ్స్‌ 29వ ఓవర్‌లో జంపా ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్‌ను ఉద్దేశిస్తూ అనుచిత పదాలను ఉపయోగించాడని అంపైర్లు క్రిస్‌ గఫానే, మారాయిస్‌ ఎరాస్మస్‌ గుర్తించారు. ఈ విషయాన్ని మ్యాచ్‌ రెఫరీకి చేరవేయడంతో జంపా తన తప్పుని ఒప్పుకొన్నాడు. ఐసీసీ కోడ్‌ ఆఫ్‌ కండక్ట్‌ ఆర్టికల్‌ 2.3 ప్రకారం అంతర్జాతీయ మ్యాచ్‌లో నిషేధిత పదాలను ఉపయోగించరాదు. అయితే ఆడంజంపా తన తప్పుని ఒప్పుకోవడంతో మందలింపుతో పాటు డిసిప్లీనరీ రికార్డులో ఒక డీమెరిట్‌ పాయింట్‌ మూటగట్టుకున్నాడు.