ఐపిఎల్‌ కోసం ప్రాక్టీస్‌ ప్రారంభించిన యువరాజ్‌

ముంబయి: ఈ సీజన్‌ ఐపిఎల్‌లో ముంబై ఇండియన్స్‌ తరుపున బరిలోకి దిగుతున్న టీమిండియా సీనియర్‌ క్రికెటర్‌ యువరాజ్‌ సింగ్‌ తన నెట్‌ ప్రాక్టీస్‌ను షురూ చేశాడు. ముంబై ఇండియన్స్‌ హోంగ్రౌండ్‌ వాంఖేడే స్టేడియంలో ఆ జట్టు ప్రాక్టీస్‌కు సిద్ధమైన తరుణంలో యువరాజ్‌ సింగ్‌ సైతం కాసేపు ప్రాక్టీస్‌ చేశాడు. ఈ ఏడాది ఐపిఎల్‌ వేలంలో యువరాజ్‌ సింగ్‌ ఏ జట్టు కొనుగోలు చేయడానికి ముందుకు రాకపోగా, చివరి నిమిషంలో ముంబై ఇండియన్స్‌ అతన్ని కనీస ధరకే దక్కించుకుంది. గతేడాది కింగ్స్‌ పంజాబ్‌ తరుపున ఎనిమిది మ్యాచ్‌లు ఆడిన యువరాజ్‌ సింగ్‌ 65 పరుగులు మాత్రమే చేసి తీవ్రంగా నిరాశపరిచాడు. దాంతో ఈ ఏడాది అతన్ని జట్టులో కొనసాగించే సాహసం కింగ్స్‌ పంజాబ్‌ ఫ్రాంచైజీ చేయలేదు. ఈ క్రమంలోనే వేలానికి యువరాజ్‌పై ఏ ఫ్రాంచైజీ కూడా ఆసక్తి కనబరచలేదు. కాగా, చివర్లో అతని కనీస ధర కోటి రూపాయలకే ముంబై ఇండియన్స్‌ కొనుగోలు చేసింది.

https://www.vaartha.com/news/sports
మరిన్ని తాజా క్రీడల వార్తల కోసం క్లిక్‌ చేయండి: