యువ ఆటగాళ్లు సత్తాచాటడానికి యత్నించాలి: కోహ్లీ…

kohil
kohil


ధర్మశాల: దక్షిణాఫ్రికాతో టీ20 సిరీస్‌లో భాగంగా టీమిండియా జట్టుకు ఎంపికైన యువ క్రికెటర్ల ముందు సువర్ణావకాశం ఉందని దానిని సద్వినియోగం చేసుకోవాలని కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ కోరాడు. తమను తాము నిరూపించుకోవడానికి ఆలస్యం చేయొద్దని తన సందేశంలో పేర్కొన్నాడు. యువ క్రికెటర్లు ఎవరైనా నాలుగైదు అవకాశాల్లోనే వారు నిరూపించుకోవాల్సి ఉంది. ప్రపంచ టీ20 సమయం ఎంతో దూరంలో లేదు. ప్రపంచకప్‌ నాటికి భారత్‌ మహా అయితే 30 మ్యాచ్‌లు ఆడొచ్చు. ఈనేపథ్యంలో నాకు 15 అవకాశాలు రావాలనే ఏ ఒక్క యువ క్రికెటర్‌ చూస్తూ కూర్చోవద్దు. సాధ్యమైనంత త్వరగా ఎంపికైన యువ ఆటగాళ్లు సత్తా చాటేందుకు యత్నించాలి. జట్టుకోణంలో చూస్తే ఎక్కువ అవకాశాలు మీముందు ఉండవు. పరిమిత ఓవర్ల క్రికెట్‌లో పరిస్థితులకు తగ్గట్టు ఆడి మిమ్ముల్ని మీరు నిరూపించుకోండి. నాలుగైదు మ్యాచ్‌ల్లోనే మీ సత్తా బయిటకు రావాలని కోహ్లీ పేర్కొన్నాడు. ఒకవైపు వరల్డ్‌ టీ20 వచ్చే ఏడాది ఆస్ట్రేలియాలో జరగనుండగా, టెస్టు చాంపియన్‌షిప్‌ కూడా మొదలు కావడంతో భారత జట్టు యువ ఆటగాళ్లకు ఎక్కువ అవకాశాలు కల్పించాలనే యోచనలో మేనేజ్‌మెంట్‌ ఉంది.

తాజా క్రీడా వార్తల కోసం క్లిక్‌ చేయండి..https://www.vaartha.com/news/sports/