అహ్మదాబాద్‌లో అతిపెద్ద క్రికెట్‌ స్టేడియం

World’s Biggest Cricket Stadium
World’s Biggest Cricket Stadium

అహ్మదాబాద్‌: ప్రపంచంలో ఇప్పటి వరకూ అతిపెద్డ క్రికెట్‌ స్టేడియంగా ఉన్న ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్న్‌ క్రికెట్‌ గ్రౌండ్‌ మరికొద్ది రోజుల్లో రెండో స్థానానికే పరిమితం కానుంది. భారత్‌లోని అహ్మదాబాద్‌ నగరంలో నిర్మించిన నూతన క్రికెట్‌ స్టేడియం ఇక నుంచి ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్‌ స్టేడియం కానుంది. రూ.700 కోట్ల వ్యయంతో నిర్మించిన ఈ స్టేడియం కెపాసిటీ ఒక లక్షా10వేలు. ఈ స్టేడియంలో 70 కార్పోరేట్‌ బాక్స్‌్‌లను, నాలుగు డ్రెస్సింగ్‌ రూమ్‌లను ఏర్పాటు చేశారు. మరొకవైపు ఒలంపిక్స్‌ సైజ్‌ స్విమ్మింగ్‌ పూల్‌ సైతం ఇందులో ఉంది. 2017 జనవరిలో ఈ స్టేడియం నిర్మాణ పనులను ఆరంభించగా పూర్తి కావడానికి సుమారు మూడేళ్లు పట్టింది. వచ్చే ఏడాది మార్చిలో ఇక్కడ అంతర్జాతీయ మ్యాచ్‌ జరగడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఆసియా ఎలెవన్‌-వరల్డ్‌ ఎలెవన్‌ మ్యాచ్‌ను ఇక్కడ నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/