విండీస్‌ స్కోరు 175/5

andre russell
andre russell, westindies all-rounder


సౌతాంప్టన్‌: వన్డే ప్రపంచకప్‌లో భాగంగా వెస్టిండీస్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ఇంగ్లాండ్‌ హార్డ్‌హిట్టర్‌ జేసన్‌ రాయ్‌ గాయపడ్డారు. విండీస్‌ బ్యాటింగ్‌ ఆరంభించిన కొద్దిసేపటికే తొడకండరాలు పట్టేయడంతో అతడు మైదానాన్ని వీడాడు. రాయ్‌ స్థానంలో విన్స్‌ ఫీల్డింగ్‌ చేయడానికి వచ్చాడు. ఐతే ఛేదనలో బ్యాటింగ్‌ చేయడానికి రాయ్‌ వస్తాడో లేదో తేలాల్సిఉంది.
టాస్‌ గెలిచిన ఇంగ్లాండ్‌ కరేబియన్స్‌కు బ్యాటింగ్‌ ఇచ్చింది. వెస్టిండీస్‌ 34 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 175 పరుగులు చేసింది. గేల్‌(36) పరుగులు చేసి ప్లంకెట్‌ బౌలింగ్‌లో బెయిర్‌స్టోకు క్యాచ్‌ ఇచ్చి ఔటయ్యాడు. హెట్మేయర్‌(39), షాయ్‌హోప్‌(11) పరుగులు చేశారు. మిగతా వారు ఆశించినంతగా ఏమీ పరుగులు చేయలేదు. ప్రస్తుతం క్రీజులో నికోలస్‌ పూరన్‌(52), ఆండ్రీ రస్సెల్‌(16)లు ఉన్నారు.

తాజా ఎన్నారై వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/nri/