నాకు సెలక్టర్‌ కావాలనుంది

Virender Sehwag
Virender Sehwag

హైదరాబాద్: తనకు సెలక్టర్‌ కావాలనుందని టీమిండియా మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ ట్విట్టర్‌లో ట్వీట్ చేయడం విశేషం. అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన తర్వాత సెహ్వాగ్ ట్విట్టర్‌లో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన సంగతి తెలిసిందే. ప్రస్తుత క్రికెటర్ల నుంచి మాజీ క్రికెటర్ల వరకు తనదైన శైలిలో ట్విట్టర్‌లో పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతుంటాడు. అయితే తాజాగా సోమవారం సెహ్వాగ్ తన ట్విట్టర్‌లో ‘నాకు సెలక్టర్‌ కావాలనుంది. కానీ అవకాశం ఇచ్చేదెవరు’ అంటూ కామెంట్ పోస్టు చేశాడు. సాధారణంగా సెహ్వాగ్ తన ట్విట్టర్ ఖాతాలో ఎక్కువగా సరదా సందేశాలే పెడుతుంటాడు కాబట్టి.. ఈ ట్వీట్‌ ఉద్దేశమేంటన్నది అతనే చెప్పాలి మరి.


తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/business/