ఐసిసి నిబంధనలను పాటిస్తాం: బిసిసిఐ

BCCI, dhoni
BCCI, dhoni

న్యూఢిల్లీ: టీమిండియా కీపర్‌-బ్యాట్స్‌మెన్‌ ఎంఎస్‌ ధోని కీపర్‌ గ్లోవ్స్‌పై ఉన్న భారత ప్యారా బలగాల చిహ్నం( బలిదాన్‌ బ్యాడ్జ్‌ ) తొలగించేందుకు సిద్ధంగా ఉన్నామని బిసిసిఐ స్పష్టం చేసింది. ఐసిసి ఈవెంట్స్‌కు సంబంధించిన నిబంధనల ప్రకారం ఆటగాళ్ల జెర్సీ, పరికరాలపై ఎలాంటి వ్యక్తిగత సందేశాలు, లోగోలు ఉండడానికి వీల్లేదు. వికెట్‌ కీపింగ్‌ గ్లోవ్స్‌పై స్పాన్సర్‌ లోగో మాత్రమే ఉండాలని ఐసిసి కోరడంతో బిసిసిఐ మెట్టుదిగింది. ఐసిసి నిబంధనలను కచ్చితంగా పాటిస్తామని, నిబంధనలకు వ్యతిరేకంగా ఏ పని చేయమని బిసిసిఐ చీఫ్‌ వినోద్‌రా§్‌ు స్పష్టం చేశారు.

తాజా ఎన్నారై వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/nri/