క్రీడాభిమానుల కోసం వాట్సాప్‌ క్రికెట్‌ స్టిక్కర్లు

whatsapp-cricket-stickers
whatsapp-cricket-stickers

హైదరాబాద్‌: దేశ వ్యాప్తంగా క్రీడాభిమానులందరూ ఐపీఎల్‌ క్రికెట్‌న ఆరాధిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ సందర్భంగా వాట్సాప్‌ తన యూజర్ల కోసం క్రికెట్‌ స్టిక్కర్లను తీసుకొచ్చింది. ఆండ్రాయిడ్‌ వినియోగదారులు ఈ క్రికెట్‌ స్టికర్లను డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. అయితే, ఐఫోన్‌ వినియోగిస్తున్న వారు మాత్రం కొంత కాలం ఆగాల్సి ఉంటుంది. ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్‌ క్రికెట్‌ అభిమానుల అంచనాలకు మించి జరుగుతోంది. ఇక నుంచి మీ ఫేవరెట్‌ టీమ్‌కు.. క్రికెటర్‌కు వాట్సాప్‌ వేదికగా మీరు మద్దతుగా నిలవవచ్చు. ఐపీఎల్‌ ఫీవర్‌ను నుంచి ఎవరూ తప్పించుకోలేరు. వాట్సాప్‌ కూడా అంటూ వాట్సాప్‌ తెలిపింది.


మరిన్ని తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/sports/