మ్యాచ్‌ క్రెడిట్‌ అంతా బౌలర్లదే!

jason holder
jason holder, WI captain

నాటింగ్‌హామ్‌: ప్రపంచకప్‌లో భాగంగా నాటింగ్‌ హామ్‌ వేదికగా వెస్టిండీస్‌-పాకిస్థాన్‌ మధ్య జరిగిన మ్యాచ్‌లో పాక్‌ ఘోరపరాజయం పాలైంది. అన్ని విభాగాల్లో రాణించడంతో పాక్‌ను 105 పరుగులకే కట్టడి చేసింది. మ్యాచ్‌ క్రిడిట్‌ను విండీస్‌ జట్టు సారథి జేసన్‌ హోల్డర్‌ బౌలర్లకే అంకితం చేశాడు. ఈ మేరకు ఆయన మీడియాతో ముచ్చటించారు.
ఈ టోర్నీని విజయంతో ప్రారంభించినందుకు చాలా ఆనందంగా ఉందని, మ్యాచ్‌ క్రెడిట్‌ బౌలర్లకే అంకితమిస్తున్నామని, ఇక మా జట్టుకు దొరికిన అరుదైన రకం ఆటగాడు రసెల్‌ అని అతని ప్రభావం జట్టులో చాలా ఉంటుందని అన్నాడు. ఒషానే బౌలింగ్‌లో మ్యాచ్‌ గెలవాలన్న కప్‌ కనిపించింది. మొదటి మ్యాచ్‌ ఎలా సాగుతుందోనని చాలా కంగారుపడ్డాను. కానీ అత్యంత సులువుగా గెలిచేశాం. మాకెలాంటి అంచనాలు లేవు. ఎలాంటి ఒత్తిడి లేకుండా క్రికెట్‌ ఆడాలని నిర్ణయించుకున్నాం అని తెలిపాడు.

తాజా క్రీడా వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/sports/