మొదటి మ్యాచ్‌ ఆడడానికి ఇంకా వారం సమయం

Bhuvneshwar Kumar
Bhuvneshwar Kumar

కార్డిప్‌: ప్రపంచకప్‌లో చివరిదైన సన్నాహక మ్యాచ్‌లో భారత్‌ బంగ్లాదేశ్‌పై ఘన విజయం సాధించడం టీమిండియా ఆత్మవిశ్వాసాన్ని పెంచిందని బౌలర్‌ భువనేశ్వర్‌ కుమార్‌ అన్నారు. ఈ సందర్భంగా భూవీ మీడియాతో మాట్లాడుతు బ్యాట్స్‌మెన్‌, బౌలర్లు క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొన్నారు. అయినప్పటికీ, వారు బాగా రాణించారు. ప్రపంచకప్‌లో బాగా ఆడడానికి ఈ విజయం ఉత్సాహాన్నిస్తుందిగ అని తెలిపాడు. ప్రపంచకప్‌లో ఆటను గెలుపుతో ప్రారంభించాలని మనం ఎల్లప్పుడూ భావిస్తాం. అయితే, ప్రపంచకప్‌లో మొదటి మ్యాచ్‌ ఆడడానికి మాకు ఇంకా వారం రోజుల సమయం ఉంది. గెలుపుకోసం మా ప్రణాళిక ఏంటో ప్రస్తుతం నేను చెప్పలేను. మేము సాధన చేస్తున్న సమయంలో, సమావేశం అయిన నేపథ్యంలో దక్షిణాఫ్రికాతో ఎలా ఆడాలన్న విషయంపై నిర్ణయం తీసుకుంటాము అని భువీ తెలిపాడు. కాగా, ప్రపంచకప్‌లో జూన్‌ 5న దక్షిణాఫ్రికాతో భారత్‌ తొలి మ్యాచ్‌ ఆడనుంది.


తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/business/