రబాడాతో నేనే నేరుగా మాట్లాడతాను

టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి

virat kohli
virat kohli, team india

సౌతాంప్టన్‌: టీమిండియా సారథి విరాట్‌ కోహ్లికి పరిణతి లేదని, విమర్శిస్తూ మాట్లాడితే విరాట్‌ అస్సలు తట్టుకోలేడని దక్షిణాఫ్రికా పేసర్‌ రబాడా విమర్శించిన విషయం తెలిసిందే. రబాడా వ్యాఖ్యలపై ఇప్పటివరకు మౌనం వహించిన కోహ్లి మీడియా సమావేశంలో దీని గురించి స్పందించాడు. ఈ సందర్బంగా విరాట్‌ మాట్లాడుతూ..రబాడా తాను ఎన్నో సార్లు పోటీ పడ్డామని, ఒకవేళ తన మీద చేసిన వ్యాఖ్యలపై చర్చించాల్సివస్తే అది తామిద్దరం తేల్చుకుంటామని, రబాడాతో తానే నేరుగా మాట్లాడాతానని ,కాని ఇలా మీడియా సమావేశంలో దీని గురించి చర్చించాలనుకోవటం లేదని స్పష్టం చేశాడు.
నేడు ప్రపంచకప్‌లో భాగంగా టీమిండియా కోటి ఆశలతో తొలి మ్యాచ్‌ కోసం మైదానంలో అడుగుపెట్టబోతుంది. ఇప్పటికే వరుస అపజయాలతో దెబ్బతిన్న సఫారీ జట్టు ఈ మ్యాచ్‌లోనైనా గెలిచి పరువు దక్కించుకోవాలని చూస్తుంది. మరోవైపు నూతనోత్సాహంతో తొలి మ్యాచ్‌లోనే బోణీ కొట్టాలని టీమిండియా చూస్తుంది.

తాజా సినిమా వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/movies/