అండగా నిలిచిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు

కోబ్‌ బ్రయంట్‌ భార్య వెనెస్సా బ్రయంట్‌ భావోద్వేగ పోస్టు

Kobe Bryant family
Kobe Bryant family

తన భర్త, కుమార్తె మరణవార్తతో తమ కుటుంబం పూర్తిగా నాశనమైందని బాస్కెట్‌బాల్‌ దిగ్గజం కోబీ బ్రయంట్ భార్య వెనెస్సా బ్రయంట్‌ భావోద్వేగానికి గురయ్యారు. వారు లేని లోటు ఎవరూ పూడ్చలేరని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి విషాదకర సమయంలో తమకు తోడుగా ఉన్న లక్షలాది మందికి ధన్యవాదాలు తెలిపారు. అభిమానులు ముద్దుగా ‘బ్లాక్‌ మాంబా’ అని పిలుచుకునే బాస్కెట్‌ బాల్‌ లెజెండ్‌ కోబీ బ్రయంట్‌, కుమార్తె గియానా(13)తో సహా మరో ఏడుగురు ఆదివారం కాలిఫోర్నియా సమీపంలోని క్యాలాబసస్‌ వద్ద జరిగిన హెలికాప్టర్‌ ప్రమాదంలో దుర్మరణం పాలైన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో మృతదేహాలు గుర్తుపట్టలేనంతగా కాలిపోయాయి. ఈ నేపథ్యంలో కోబీ మరణంపై అతడి భార్య వెనెస్సా గురువారం తన ఇనిస్టాగ్రామ్‌లో భావోద్వేగ సందేశాన్ని పోస్టు చేసింది. ఖిఈ విషాదకర సమయంలో తమకు తోడుగా ఉన్న లక్షలాది మందికి ప్రజలకు ధన్యవాదాలు చెప్పాలనుకుంటున్నాను. మాపట్ల చేసిన ప్రార్థనలకు ధన్యవాదాలు. మాకు ఖచ్చితంగా అవి అవసరం. నేను ఎంతో ఆరాధించే నా భర్త అకస్మాత్తుగా కోల్పోవడం మా కుటుంబాన్ని అగాథంలోకి నెట్టివేసిందిఖి అని అన్నారు.

తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/business/