అవకాశం ఉంటే ఆడాలని ఉంది

డుప్లిసిస్‌కు డివిలియర్స్‌ ఫోన్‌

du Plessis, AB de Villiers
du Plessis, AB de Villiers

సౌతాంప్టన్‌: దక్షిణాఫ్రికా స్టార్‌ ప్లేయర్‌ ఏబి డివిలియర్స్‌ రిటైర్మెంట్‌ వెనక్కు తీసుకుని మళ్లీ ప్రపంచకప్‌ ఆడతానని తనకు ఫోన్‌ చేశాడని ఆ జట్టు కెప్టెన్‌ డుప్లిసిస్‌ పేర్కొన్నాడు. వర్షం కారణంగా మ్యాచ్‌ రద్దయ్యాక మీడియా సమావేశంలో ఈ విషయాన్ని వెల్లడించాడు. ప్రపంచకప్‌ జట్టుని ప్రకటించే ముందు రోజు రాత్రి మిత్రుడు డివిలియర్స్‌ నుంచి ఫోన్‌ వచ్చింది. అవకాశం ఉంటే నాకు ఆడాలని ఉందని చెప్పాడు.
అప్పటికే ఆలస్యం కావడంతో సెలక్టర్లతో మాట్లాడి చూస్తానని చెప్పాను. ఆ తర్వాత రోజు తాను వారిని సంప్రదించాక..సమయం గడియిపోయిందని ఇప్పుడు డివిలియర్స్‌ను చేర్చుకోవడం అసాధ్యమని తెలిపారు అని పేర్కొన్నాడు. ఐతే ఈ విషయం వల్ల తమ స్నేహానికి ఇబ్బంది కలగకూడదని ఇదొక చిన్న విషయాన్ని వెల్లడి చేశాడు.

తాజా క్రీడా వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/sports/