తొలి వికెట్‌ కోల్పోయిన ఆసీస్‌

AUS vs ENG
AUS vs ENG

లండన్‌: ఐసిసి ప్రపంచకప్‌లో భాగంగా లార్డ్స్‌ మైదానం వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ఆస్ట్రేలియాకు శుభారంభం లభించింది. ఈ మ్యాచ్‌లో ఆసీస్‌ తొలిగా బ్యాటింగ్‌ దిగింది. ఆసీస్‌ ఓపెనర్లు డేవిడ్‌ వార్నర్‌, ఆరోన్‌ ఫించ్‌లు నిలకడగా ఆడుతుండగా బ్రేక్‌ పడింది. హాఫ్‌ సెంచరీ చేసిన డేవిడ్‌ వార్నర్‌(53) మొయీన్‌ అలీ బౌలింగ్‌లో జో రూట్‌కు క్యాచ్‌ ఇచ్చి ఔటయ్యాడు. ఆసీస్‌ 26 ఓవర్లకు ఒక వికెట్‌ నష్టపోయి 141 పరుగులు చేశారు. ప్రస్తుతం క్రీజులో ఆరోన్‌ ఫించ్‌(77), ఉస్మాన్‌ ఖ్వాజా(8)లు ఉన్నారు.

తాజా క్రీడా వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/sports/