ప్రపంచకప్‌కి అతనిపై వేటు తప్పదు…

ముంబై : ఆస్ట్రేలియాతో బుధవారం ముగిసిన వన్డే సిరీస్‌తో ప్రపంచకప్‌ జట్టుపై ఓ అంచనాకి వచ్చినట్లు భారత కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ స్పష్టం చేశాడు. ఐదు వన్డేల ఈసిరీస్‌లో నాలుగో వన్డే నుంచి టీమ్‌లో ప్రయోగాలు చేసిన టీమిండియా…చివరి మూడు వన్డేల్లోనూ ఓడి 2-3తో సిరీస్‌ను చేజార్చుకుంది. అయినప్పటికీ…ఈ ఓటమి తమకి మంచే చేసిందని వ్యాఖ్యానించిన కోహ్లీ…సిరీస్‌లో చేసిన తప్పిదాలను ప్రపంచకప్‌లో దిద్దుకుంటామని ధీమా వ్యక్తం చేశాడు. ఈనెల 23 నుంచి ఐపిఎల్‌ 2019 సీజన్‌ మొదలుకానుండగా…ఆ తర్వాత మే30 నుంచి ఇంగ్లాండ్‌ వేదికగా వన్డే ప్రపంచకప్‌ ప్రారంభం కానుంది. ప్రపంచకప్‌ని దృష్టిలో ఉంచుకుని ఆస్ట్రేలియాపై సిరీస్‌లో ఆటగాళ్లకి కొన్ని బాధ్యతలు అప్పగించి పరీక్షించాం. ప్రపంచకప్‌ జట్టుపై మాకు పూర్తి స్పష్టత ఉంది. అయితే…ఒక స్థానం గురించి మాత్రం ఇంకా చర్చించాల్సి ఉంది. చివరి మూడు వన్డేల్లోనూ ప్రయోగాలు చేయడం ద్వారా ఒత్తిడిలో ఆటగాళ్ల ప్రదర్శనపై ఎలా ఉంది…? అని గమనించాం. సిరీస్‌ ఫలితం మాకు అనుకూలంగా రాలేదు. కానీ…సిరీస్‌లో భారత్‌ బాగానే ఆడింది కాకపోతే…టీమిండియా కంటే ఆస్ట్రేలియా ఎక్కువ కసితో ఆడిందని విరాట్‌ కోహ్లీ వెల్లడించాడు. ఆస్ట్రేలియాతో సిరీస్‌ కంటే ముందు జట్టులో రెండు స్థానాలకి (నెం.4 బ్యాట్స్‌మెన్‌,రెండో వికెట్‌ కీపర్‌) ఆటగాళ్లకి పరీక్షించాలని చెప్పిన విరాట్‌ కోహ్లీ ఇప్పుడు ఒక స్థానంపై పూర్తి స్పష్టత వచ్చినట్లు పరోక్షంగా అంగీకరించాడు. దీంతో….ఏ స్థానంపై సందేహం…? అనేదానిపై ఇప్పుడు సర్వత్రా ఆసక్తి నెలకొంది. సిరీస్‌లో నెం.4లో ఆడిన అంబటి రాయుడు నిరాశపరచగా…అతనిపై మధ్యలోనే వేటు వేశారు. ఇక చివరి రెండు వన్డేల్లో ధోని స్థానంలో వికెట్‌ కీపర్‌గా ఆడిన పంత్‌ దారుణంగా విఫలమయ్యాడు. దీంతో…ప్రపంచకప్‌లో రెండో వికెట్‌ కీపర్‌గా పంత్‌ను ఎంచుకుని….నెం.4లో అంబటి రాయుడి స్థానంలో విజ§్‌ు శంకర్‌ని ఆడించాలనే ఆలోచనలో కోహ్లీ ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే…ఐపిఎల్‌ 2019 సీజన్‌ తర్వాత అంచనాలు తారుమారయ్యే అవకాశాలు లేకపోలేదు. ఎందుకంటే…గత ఏడాది ఐపిఎల్‌లో చెన్నై సూపర్‌కింగ్స్‌ తరుపున పరుగుల వరద పారించిన అంబటి రాయుడు….టీమిండియాలోకి రీఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే.

మరిన్ని తాజా క్రీడల వార్తల కోసం క్లిక్‌ చేయండి
:https://www.vaartha.com/news/sports/