ఈ ఒక్క విషయంలో నన్ను అనుసరించకండి

Virat Kohli
Virat Kohli

హైదరాబాద్‌: ఉప్పల్‌ స్టేడియం వేదికగా వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచ్‌ అనంతరం టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ మాట్లాడారు. ఈ మ్యాచ్‌లో తన ఆటలోని అర్థభాగాన్ని యువ ఆటగాళ్లు ఫాలో అవ్వకండని కింగ్‌ కోహ్లీ తెలిపారు. తొలి అర్థభాగంలో షాట్లు ఆడడానికి ప్రయత్నించినప్పటికీ అది సాధ్యపడక నిదానంగా ఆడాల్సివచ్చిందని అన్నారు. జేసన్‌ బౌలింగ్‌లో పరిస్థితి పూర్తిగా మారిపోయిందని, పైగా కెఎల్‌ రాహుల్‌పై ఒత్తిడి పడకూడదనే ఉద్దేశంతోనే 140 స్ట్రైక్‌ రేటుతో ఆడానని తెలిపారు. టీ20ల్లో బంతిని బౌండరీలకు పంపి అభిమానులను అలరించే రకం కాదని, పని పూర్తి చేసేందుకునే తాను దృష్టి పెడతానని కోహ్లీ తెలిపారు. కోహ్లీ ఆఖరివరకు నిలబడి జట్టును గెలిపించారు. మూడు సిరీస్‌ల టీ20లో భారత్‌ 1-0 ఆధిక్యంలో నిలిచింది. కాగా తరువాతి మ్యాచ్‌ ఆదివారం తిరువనంతపురంలో జరగనుంది.

తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/international-news/