బౌలర్లు ధైర్యం చేసుంటే మ్యాచ్‌ గెలిచేది

virat kohli
virat kohli


బెంగళూరు: కోల్‌కత్తా నైట్‌ రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఓటమి పాలైన రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు జట్టు సారథి కోహ్లి స్పందించాడు. ఓటమికి కారణం బౌలర్ల వైఫల్యమేనని, బౌలర్లు ధైర్యం చేసి ఉంటే మ్యాచ్‌ ఫలితం వేరేలా ఉండేదని పేర్కొన్నాడు. మ్యాచ్‌ అనంతరం కోహ్లి మాట్లాడుతూ..నిన్నటి మ్యాచ్‌ ఫలితాన్ని ఎవరూ ఊహించి ఉండరు. చివరి నాలుగు ఓవర్లలోనే కథ అడ్డం తిరిగింది. కీలక సమయాల్లో ధైర్యంగా బౌలింగ్‌ చేస్తే ఎలాంటి జట్టుకైనా విజయం తథ్యం. రసెల్‌ లాంటి పవర్‌ హిట్టర్లను ఎదుక్కోవాలంటే అంతకు మించిన ప్రదర్శన మాకు అవసరం. ఇలాంటి సమయాల్లో మేం మా మీద నమ్మకాన్ని కోల్పోకూడదు అని అన్నాడు.

తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/business/