ఈడెన్‌ టెస్టులో శతకం దిశగా కోహ్లీ

నాలుగో వికెట్‌ కోల్పోయిన టీమిండియా

Virat Kohli
Virat Kohli

కోల్‌కతా: ఈడెన్‌ గార్డెన్స్‌లో బంగ్లాదేశ్‌తో జరుగుతున్న పింక్‌ బాల్‌ డే నైట్‌ టెస్టులో భారత సారథి విరాట్‌ కోహ్లీ అత్యుత్తమ ప్రదర్శన కనబర్చి 79 పరుగులతో సెంచరీ దిశగా దూసుకెళ్తున్నారు. మరోవైపు కోహ్లీ, అజింక్య రహానె భాగస్వామ్యం అద్భుతంగా రాణిస్తున్న సమయంలో రహానె 51 పరుగులతో 236 వద్ద ఔటయ్యారు. తైజుల్‌ ఇస్లామ్‌ బౌలింగ్‌లో హుస్సేన్‌కు క్యాచ్‌ ఇచ్చారు అజింక్య రహానె. దీంతో ప్రస్తుత స్కోరు 236-4గా ఉంది. రహానె, కోహ్లీల భాగస్వామ్యానికి బ్రేక్‌ పడింది. ప్రస్తుతం కోహ్లీ, జడేజా క్రీజులో ఉన్నారు.

తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/international-news