బీచ్‌లో సందడి చేసిన టీమిండియా!

team india
team india

ఆంటిగ్వా: టీమిండియా ఆగస్టు 3 నుంచి విండీస్‌ పర్యటనలో బిజీబిజీగా ఉన్నారు. అయితే రేపటి నుంచి వెస్టిండీస్‌తో టెస్టు సిరీస్‌ మొదలుకానున్న నేపథ్యంలో కోహ్లీ సేన ఒత్తిడిని పక్కన పెట్టి బీచ్‌లో కొద్దిసేపు సరదాగా గడిపింది. కెప్టెన్ విరాట్ కోహ్లీ, వైస్‌ కెప్టెన్‌ అజింక్య రహానె, రోహిత్‌ శర్మ, ఇషాంత్‌ శర్మ, కేఎల్‌ రాహుల్, రిషభ్‌ పంత్‌, జస్ప్రీత్‌ బుమ్రా, మయాంక్ అగర్వాల్‌, సహాయ సిబ్బంది బీచ్‌లో జాలీగా ఎంజాయ్‌ చేశారు. దీనికి సంబంధించిన చిత్రాలను కోహ్లీ తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఉంచాడు. బీచ్‌లో ఆటగాళ్లతో ఇదో ఓ అద్భుతమైన రోజు అంటూ ట్యాగ్‌ చేశాడు.


తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/business/