కోహ్లీ మరో రికార్డు

Virat kohil
Virat kohil

పుణె: పుణెలో దక్షిణాఫ్రికాతో జరుగుతున్న రెండో టెస్టులో ద్విశతకంతో చెలరేగిన భారత్‌ కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ మరిన్ని రికార్డులు సాధించాడు. భారత్‌ తరపున అత్యధికంగా ద్విశతకాలు బాదిన బ్యాట్స్‌మెన్‌గా రికార్డును సృష్టించాడు. కోహ్లీ 7 ద్విశతకాలతో అగ్రస్థానంలో నిలిచాడు. కాగా సచిన్‌ టెండుల్కర్‌, వీరేంద్ర సెహ్వాగ్‌ ఆరుసార్లు డబుల్‌ సెంచరీలు చేశారు. కోహ్లీ వీరిద్దరిని మించిపోయాడు. ఈ మ్యాచ్‌లో అత్యధిక వ్యక్తిగత స్కోరు చేసిన ఘనత కోహ్లీకి దక్కింది. తన రికార్డును 15వ సారి బద్దలు కొట్టడం విశేషం.
తాజా క్రీడా వార్తల కోసం క్లిక్‌ చేయండి..https://www.vaartha.com/news/sports/