విజయ్‌ శంకర్‌ కుడిచేతికి గాయం.. ఫ్రాక్చర్‌ కాలేదు

Vijay Shankar
Vijay Shankar

లండన్‌: టీమిండియా ఆల్‌రౌండర్‌ విజయ్‌ శంకర్‌ న్యూజిలాండ్‌తో ప్రాక్టీస్‌ మ్యాచ్‌ సందర్భంగా నెట్స్‌లో ప్రాక్టీస్‌ చేస్తుండగా గాయపడటంతో ప్రాక్టీస్‌ సెషన్‌ మధ్యలోనే అతడు వెనుదిరిగాడు. అయితే అతడి గాయం త్రీవతపై టీమిండియా మేనేజ్‌మెంట్‌ ఈరోజు స్పందించింది. శుక్రవారం సాధన చేస్తుండగా విజయ్‌ శంకర్‌ కుడిచేతికి దెబ్బతగిలింది. దీంతో అతన్ని ఇవాళ హాస్పిటల్‌కు తీసుకెళ్లి.. స్కానింగ్‌ తీయించాం. చేతికి ఫ్రాక్చర్‌ కాలేదని వైద్యులు తెలిపారు. అతడు త్వరగా కోలుకునేందుకు బీసీసీఐ మెడికల్‌ టీమ్‌ అతనికి చికిత్స అందిస్తోంది. అని బీసీసీఐ ట్విటర్‌ వేదికగా పేర్కొంది.


మరిన్ని తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/business/