కామన్వెల్త్‌లో తెలుగు సత్తా

VENKAT RAHUL-
VENKAT RAHUL-

కామన్వెల్త్‌లో తెలుగు సత్తా

వెయిట్‌ లిఫ్టింగ్‌లో స్వర్ణం సాధించిన రాహుల్‌

సిఎం చంద్రబాబు అభినందన

అమరావతి: కామన్‌వెల్త్‌ 2018క్రీడల్లో భాగంగా వెయిట్‌ లిఫ్టింగ్‌ పోటీలలో 85కేజీల కేటగిరిలో బంగారు పతకాన్ని తెలుగు తేజం రాగాల వెంకట రాహుల్‌ కైవసం చేసుకు న్నారు. ఈ సందర్భంగా సిఎం చంద్రబాబు బంగారు పతకాన్ని సాధించిన రాహుల్‌ను అభినం దించారు. గోల్డ్‌కోస్ట్‌ అస్ట్రేలియాలో జరుగుతున్న కామన్‌వెల్త్‌ క్రీడల్లో 85కేజీల వెయింట్‌ లిప్టింగ్‌ కేటగిరలో స్నాచ్‌ విభాగంలో 151కేజీలు, క్లిన్‌ అండ్‌ జర్క్‌ విభాగంలో 187కేజీలు మొత్తం 338కేజీలు బరువు ఎత్తి బంగారు పతకాన్ని సాధిం చారు. గుంటూరు జిల్లా స్టువర్టుపురంకు చెందిన రాగాల వెంకట రాహుల్‌ను గతంలో ముఖ్యమంత్రి చంద్రబాబు అభినందించి రూ.15లక్షల ప్రోత్సా హకాన్ని అందించినట్లు శాప్‌ అధికారులు వెల్లడిం చారు. రాష్ట్రంలో క్రీడలఅభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ఇతోధికంగా కృషి చేయడం జరుగుతోందన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు అందించిన ప్రోత్సాహం నేపధ్యంలోనే రాహుల్‌ కామన్‌వెల్త్‌ క్రీడల్లో బంగారు పతకం సాధించడానికి దోహదపడింద న్నారు. రాగాల వెంకట రాహుల్‌ను రాష్ట్ర క్రీడలశాఖ మంత్రి కొల్లు రవీంద్ర, ప్రత్యేక అభినందలు తెలిపారు.