తొలి వన్డేకి ఆతిథ్యమిస్తోన్న అమెరికా…

usa cricket
usa cricket

న్యూఢిల్లీ : సెప్టెంబర్‌లో యునైటెడ్‌ స్టేట్స్‌ తొలిసారిగా ఓ వన్డే మ్యాచ్‌కి ఆతిథ్యమివ్వబోతోంది. క్రికెట్‌లో మొట్టమొదటి అంతర్జాతీయ గేమ్‌ 1844లో యునైటెడ్‌ స్టేట్స్‌-బ్రిటిష్‌ ప్రోవిన్స్‌ జట్ల మధ్య జరిగింది. న్యూయార్క్‌ వేదికగా ఈ మ్యాచ్‌ జరిగి నూట డెబ్బై సంవత్సరాలు అవుతుంది.ఈనేపథ్యంలో యునైటెడ్‌ స్టేట్స్‌ సెప్టెంబర్‌ 13న పపునా న్యూగినియాతో తొలి వన్డే మ్యాచ్‌లో తలపడనుంది. ఐసిసి పురుషుల క్రికెట్‌ ప్రపంచకప్‌ లీగ్‌-2లో భాగంగా రెండో ముక్కోణపు సిరీస్‌లో అమెరికా జట్టు పపువా న్యూగినియా జట్టుతో తలపడనుంది. ఈ సిరీస్‌లో నమీబియా మూడో జట్టుగా ఆడుతోంది. అమెరికా గడ్డపై క్రికెట్‌కు ప్రాచుర్యం కల్పించేందుకుగాను ఇప్పటికే టీమిండియా, వెస్టిండీస్‌ లాంటి జట్లు పలు టీ20 మ్యాచ్‌లను ఆడాయి. ఆగస్టులో లాడౌర్హిల్‌, ఫ్లోరిడా వేదికగా వెస్టిండీస్‌తో జరిగిన రెండు టీ20ల్లో టీమిండియానే విజయం సాధించిన సంగతి తెలిసిందే.
తాజా క్రీడా వార్తల కోసం క్లిక్‌ చేయండి.. https://www.vaartha.com/news/sports/