యూఎస్‌ ఓపెన్‌ విజేత నాదల్‌…

nadal
nadal


న్యూయార్క్‌: యూఎస్‌ ఓపెన్‌ పురుషుల సింగిల్స్‌ టైటిల్‌ను స్పెయిన్‌ బుల్‌ రఫెల్‌ నాదల్‌ గెలుచుకున్నాడు. ఉత్కంఠభరితగా సాగిన యూఎస్‌ ఓపెన్‌ ఫైనల్లో నాదల్‌ విజయం సాధించాడు. హోరాహోరీగా జరిగిన తుదిపోరులో ఐదో సీడ్‌ డానిల్‌ మెద్వెదేవ్‌ (రష్యా)ను 7-5, 6-3, 5-7, 4-6, 6-4తో మట్టికరిఇంచాడు. ఈ విజయంతో కెరీర్‌లో 19వ గ్రాండ్‌స్లామ్‌ టైటిల్‌ను తనఖాతాలో వేసుకున్నాడు. అత్యధిక గ్రాండ్‌స్లామ్‌ టైటిల్స్‌ రికార్డుకు రెండు అడుగుల దూరంలో నిలిచాడు.ఉత్కంఠ ఊపేసిన ఈ ఫైనల్‌ మ్యాచ్‌లో నాదల్‌, మెద్వెదేవ్‌ వీరోచితంగా పోరాడు. ఆఖరి వరకూ నువ్వా నేనా అన్నట్లు సాగిన ఈమ్యాచ్‌ 4గం.ల 50నిమిషాల పాటు జరిగింది. తొలిసారి గ్రాండ్‌స్లామ్‌ ఫైనల్లో అడుగుపెట్టిన మెద్వెదేవ్‌ అంత సులువుగా తలవంచలేదు.

మొదటి రెండు సెట్‌లు రఫెల్‌ గెలిచినప్పటికీ మెద్వదేవ్‌ కుంగిపోకుండా మొండి ధైర్యంతో పోరాడాడు. మూడు, నాలుగు సెట్లను దక్కించుకుని నాదల్‌కు చెమటలు పట్టించాడు. నిర్ణయాత్మక ఐదో సెట్‌లో రఫెల్‌ విజృంభించడంతో మెద్వెదేవ్‌ ఓటమి పాలయ్యాడు.నాదల్‌కు నాలుగు గంటల మద్ధతుగా 24వేల మంది అభిమానులు…మెద్వెదేవ్‌ని మాత్రం ఏడిపించే ప్రయత్నం చేశారు. టోర్నీ మూడో రౌండ్‌లో ప్రేక్షకులని అసభ్య సంజ్ఞలతో డానియల్‌ కోపం తెప్పించిన విషయం తెలిసిందే. దీంతో…ఫైనల్లోనూ అతనికి మద్ధతు లభించలేదు. అయినప్పటికీ ఈ రష్యా క్రీడాకారుడు గొప్పగా పోరాడాడు. ఇటీవలి కాలంలో మెద్వెదేవ్‌ కెరీర్‌ బెస్ట్‌ ప్రదర్శనతో ఆకట్టుకుంటూ వస్తుఆ్నడు. ఎంతలా అంటే…? చివరిగా అతను ఆడిన 23 మ్యాచుల్లో 20 మ్యాచ్‌లను గెలిచాడు. ఈ క్రమంలోనే దిగ్గజ క్రీడాకారుల్ని వెనక్కి నెట్టి తొలిసారి యూఎస్‌ ఫైనల్‌కి చేరిన డానియల్‌ కొద్దిలో టైటిల్‌ను చేజార్చుకున్నాడు. చాంపియన్‌ రఫెల్‌కు 38,50,000డాలర్లు (రూ.27కోట్ల 59లక్షలు)…రన్నరప్‌ మెద్వెదేవ్‌కు 19,00,000 డాలర్లు (రూ.13కోట్ల 62లక్షలు) ఫ్రైజ్‌మనీగా లభించాయి. 20గ్రాండ్‌స్లామ్‌ టైటిల్స్‌తో రోజర్‌ ఫెదరర్‌…నాదల్‌ కంటే ముందున్నాడు. మరో టైటిల్‌ సాధిస్తే ఫెదరర్‌ రికార్డును నాదల్‌ సమం చేస్తాడు. 30వ ఏట అడుగుపెట్టిన తర్వాత ఐదు మేజర్‌ టైటిల్స్‌ నెగ్గిన ఆటగాడిగా రఫెల్‌ నాదల్‌ సరికొత్త రికార్డు నెలకొల్పాడు. ఫెదరర్‌, నొవాక్‌ జకోవిచ్‌, రొడ్‌ లావెర్‌, కెన్‌ రోజ్‌వాల్‌ పేరిట ఉన్న రికార్డును నాదల్‌ బద్దలు కొట్టాడు.
తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి..https://www.vaartha.com/news/national/