బంగారం వ్యాపారంలోకి దిగిన క్రిస్‌ గేల్‌

Chris Gayle
Chris Gayle

వెస్టిండీస్‌: ఆటతోనే కాకుండా తన లైఫ్ స్టయిల్ తోనూ ప్రత్యేకంగా నిలిచే వెస్టిండీస్ విధ్వంసకర క్రికెటర్ క్రిస్ గేల్ కొత్త బిజినెస్ లోకి అడుగుపెట్టాడు. యూనివర్స్ బాస్ అని తనకు తానే బిరుదు ఇచ్చుకున్న ఈ విధ్వంసకర బ్యాట్స్ మన్ ఇప్పుడు ఆ బ్రాండ్ నేమ్ తో జ్యువెలరీ వ్యాపారంలోకి దిగాడు. తన పేరుతో ముద్రించిన గోల్డ్ రింగ్స్ ను ప్రవేశ పెట్టాడు. స్వచ్ఛమైన బంగారంతో చేసిన ఈ ఉంగరాల ముందు భాగంలో క్రిస్ గేల్ ప్రతిబింబంతో పాటు అతని పేరు సూచించేలా ఖసీజీగ అని క్యాపిటల్ లెటర్స్ తో ముద్రించారు. అలాగే, నాలుగు వైపులా యూనివర్స్ బాస్ అని రాసి ఉంది. రెండు కొనల్లో అతని జెర్సీ నంబర్ 333ని ముద్రించగా.. లోపలి భాగంలో గేల్ సంతకం ఉంది. ఈ స్పెషల్ ఎడిషన్ ఉంగరాలను విడుదల చేసిన గేల్ వాటి ఫొటోలను తన ఇన్ స్టాగ్రామ్ అకౌంట్లో పోస్ట్ చేశాడు. ఈ గోల్డ్ రింగ్ ఖరీదు ఎంతో చూడాలి.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/