వర్షం కారణంగా ఆలస్యంగా మ్యాచ్‌

match ground
match ground


బ్రిస్టల్‌: నేడు ప్రపంచకప్‌లో మ్యాచ్‌లలో భాగంగా పాకిస్థాన్‌, శ్రీలంకల మధ్య మ్యాచ్‌ జరగాల్సిఉంది. ఐతే వర్షం కారణంగా అంపైర్లు టాస్‌ను వాయిదా వేశారు. చిరుజల్లులు కురుస్తుండడంతో మైదానం సిబ్బంది పిచ్‌ను కవర్లతో కప్పి ఉంచారు.
ఈ రోజు జరగబోయే మ్యాచ్‌ ఆసక్తికరంగా సాగే అవకాశముంది. విండీస్‌ చేతిలో ఖంగుతిన్న పాక్‌ జట్టు తొందరగానే తేరుకుని పాక్‌ గెలుపు బాట పట్టింది. ఇంగ్లండ్‌తో మ్యాచ్‌లో సమిష్టి ప్రదర్శనతో సత్తాచాటుతూ అద్భుత విజయాన్ని సొంతం చేసుకుంది. నేడు లంకతో ఆడే మ్యాచ్‌లో పాక్‌ అదరగొట్టాలని చూస్తున్నది. మరోవైపు మెగాటోర్నీని ఓటమితో మొదటుపెట్టిన లంక..ఆఫ్ఘన్‌పై విజయంతో పరువు కాపాడుకుని పోటీలోకి వచ్చింది.

తాజా క్రీడా వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/sports/