ఐపిఎల్‌ 2020: ముగ్గురిపై కన్నేసిన చెన్నై ఫ్రాంఛైజీ

Chennai Super Kings
Chennai Super Kings

చెన్నై: కోల్‌కతా వేదికగా డిసెంబర్‌ 19న ఆటగాళ్ల వేలం జరగనుంది. కాగా ఇప్పటికే వేలంలో వదిలిపెట్టిన, కొనసాగింపు ఆటగాళ్ల జాబితాను అన్ని ఫ్రాంఛైజీలు బిసిసిఐకి సమర్పించాయి. అయితే వీటిలో ప్రధానంగా చెన్నై సూపర్‌ కింగ్స్‌ ముగ్గురిపై ప్రత్యేక దృష్టి సారించనుందని సమాచారం. ఈ వేలంలో చెన్నై జట్లు ఫాస్ట్‌ బౌలర్‌ మోహిత్‌ శర్మను విడిచిపెట్టి అతని స్థానంలో యువ ఫాస్ట్‌ బౌలర్‌ జయదేవ్‌ ఉనద్కత్‌ని తీసుకోవాలని చూస్తుంది. అలాగే వెస్టిండీస్‌కు చెందిన డ్వేన్‌ బ్రావో తరచూ గాయపడుతుండంతో అతడి స్థానంలో కార్లోస్‌ బ్రాత్‌వైట్‌ను, ఆరంభం నుంచి ఫిట్‌నెస్‌ సమస్యలతతో బాధపడుతున్న వేదార్‌ జాదవ్‌కు బ్యాకప్‌గా విరాట్‌ సింగ్‌ను తీసుకోవాలని చెన్నై సూపర్‌ కింగ్స్‌ నిర్ణయించుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/