ఈసారి ఐపిఎల్‌ టైటిల్‌ ఢిల్లీ క్యాపిటల్స్‌దే : ధావన్‌…

న్యూఢిల్లీ: ఐపిఎల్‌ 2019 సీజన్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌ (ఢిల్లీ డేర్‌ డెవిల్స్‌)కి టైటిల్‌ గెలిచే అవకాశాలు ఎక్కుకగా ఉన్నాయని సీనియర్‌ ఓపెనర్‌ శిఖర్‌ ధావన్‌ ధీమా వ్యక్తం చేశాడు. 2018 సీజన్‌లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ టీమ్‌కి ఆడిన ధావన్‌…ఐపిఎల్‌ 2019 సీజన్‌ ఆటగాళ్ల వేలం ముంగిట తన ధర విషయంలో ఫ్రాంచైజీతో విభేదించి ఢిల్లీ క్యాపిటల్స్‌ టీమ్‌కి మారిపోయిన విషయం తెలిసిందే. ధావన్‌ను ఢిల్లీ జట్టుకి బదిలీ చేసిన సన్‌రైజర్స్‌ అతని స్థానంలో విజ§్‌ు శంకర్‌తో పాటు మరో ఇద్దరు ఆటగాళ్లను ఆ టీమ్‌ నుంచి తీసుకుంది. మార్చి 23 నుంచి ఐపిఎల్‌ 2019 సీజన్‌ మొదలుకానుండగా…24న ఢిల్లీ క్యాపిటల్స్‌ జట్టు తొలి మ్యాచ్‌లో ముంబయి ఇండియన్స్‌ను ఢీకొనబోతుంది. ఐపిఎల్‌ మ్యాచ్‌లకి సిద్ధమవుతున్న శిఖర్‌ ధావన్‌…తాజాగా మీడియాతో మాట్లాడుతూ ఐపిఎల్‌లో సమతూకంగా ఉన్న జట్టే విజేతగా నిలుస్తూ వస్తోంది. ఈ ఏడాది ఢిల్లీ క్యాపిటల్స్‌ టీమ్‌ నుంచి సమతూకంగా ఉంది. జట్టులో నైపుణ్యమున్న ఆల్‌రౌండర్లు, స్పిన్నర్లు, బ్యాట్స్‌మెన్లు ఉన్నారు. అన్నిటికంటే ముఖ్యంగా…టాప్‌ 4 బ్యాట్స్‌మెన్‌ (శిఖర్‌ ధావన్‌, పృథ్వీషా, శ్రేయాస్‌ అయ్యర్‌, రిషబ్‌ పంత్‌) భారత్‌ ఆటగాళ్లు. కాబట్టి…కొంచెం వాళ్లు బ్యాట్‌ ఝుళిపించగలిగితే…ఢిల్లీ జట్టు కచ్చితంగా ఈఏడాది టైటిల్‌ను గెలవగలదని ధీమా వ్యక్తం చేశారు.

https://www.vaartha.com/news/sports/మరిన్ని తాజా క్రీడా వార్తల కోసం క్లిక్‌ చేయండి.