200సిక్సుల క్లబ్‌లో చేరేందుకు ఆముగ్గురి మధ్య పోటీ…

న్యూఢిల్లీ: ఐపిఎల్‌ సీజన్‌ ప్రారంభానికి ముహూర్తం దగ్గర పడుతోంది. పదేళ్లుగా అభిమానులను అలరించిన ఐపిఎల్‌ ఈ ఏడాది ప్రపంచకప్‌ ముందు మరింత ఆసక్తికరంగా సాగే అవకాశం ఉంది. వచ్చే ఐపిఎల్‌లో భారత స్టార్‌ క్రికెటర్లు ధోని, రోహిత్‌, రైనాలను అరుదైన రికార్డు ఊరిస్తోంది. ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌లో 200సిక్సులు కొట్టిన తొలి భారత క్రికెటర్‌గా నిలవడానికి వీరు ముగ్గురు పోటీపడుతున్నారు. ఐపిఎల్‌లో అత్యధిక సిక్స్‌లు బాదిన భారత క్రికెటర్‌ ధోని (186), తర్వాత స్థానంలో రైనా (185) ఉన్నాడు. మూడో స్థానంలో రోహిత్‌ శర్మ (184) ఉన్నాడు. ఐపిఎల్‌లో అత్యధిక సిక్స్‌లు కొట్టిన ఆటగాళ్ల జాబితాలో క్రిస్‌గేల్‌ (292) అగ్రస్థానంలో ఉన్నాడు. ఎబి డివిలియర్స్‌, ధోని సంయుక్తంగా రెండో స్థానంలో ఉన్నారు. మరో 15 పరుగులు చేస్తే ఐపిఎల్‌లో 5వేల పరుగుల మైలురాయిని చేరుకున్న తొలి క్రికెటర్‌గా సురేశ్‌ రైనా రికార్డు క్రియేట్‌ చేస్తాడు. ఐదు క్యాచ్‌లు అందుకుంటే ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌లో వంద క్యాచ్‌లు అందుకున్న తొలి ఫీల్డర్‌గానూ రికార్డు నెలకొల్పాడు.

మరిన్ని తాజా క్రీడా వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/sports/