ఐపిఎల్‌ నిర్వహణకు ఏర్పాట్లు జరగడం లేదు

ఐపిఎల్‌ నిర్వహణ ప్రభుత్వ నిర్ణయం మీద ఆధారపడి ఉంది.

rajiv shukla
rajiv shukla

దిల్లీ: దేశంలో లాక్‌డౌన్‌ కొనసాగుతున్న నేపథ్యంలో ప్రస్తుతం ఐపిఎల్‌ నిర్వహణకు ఎలాంటి ఏర్పాట్లు జరగడంలేదని ఐపిఎల్‌ మాజీ ఛైర్మెన్‌ రాజీవ్‌ శుక్లా అన్నారు. ఇపుడున్న పరిస్థితుల్లో ప్రజల ప్రాణాలు ముఖ్యమని, ఈ పరిస్థితుల్లో ఐపిఎల్‌ నిర్వహణ అనేది ప్రభుత్వం లాక్‌డౌన్‌పై తీసుకునే నిర్ణయం మీదే ఆధారపడి ఉందని స్పష్టం చేశారు. ప్రస్తుతం దేశంలో లాక్‌డౌన్‌ పొడగించాలనే వార్తలను ఎక్కువగా వింటున్నాం. ఒక వేళ ఏప్రిల్‌ 15న ఐపిఎల్‌ ప్రారంభమవుతుందని మీరు భావిస్తే మాత్రం… పరిస్థితి అందుకు భిన్నంగా కనిపిస్తుందని అన్నారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/telangana/