ఐపిఎల్‌ చరిత్రలో అత్యంత చెత్త రికార్డులివే

న్యూఢిల్లీ: ఇప్పటివరకు 11 సీజన్లు పూర్తిచేసుకున్న ఐపిఎల్‌ 12వ సీజన్‌కు సిద్ధంగా ఉంది. మరో మూడు రోజుల్లో చెన్నై సూపర్‌కింగ్స్‌, రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగుళూరు మధ్య మొదటి మ్యాచ్‌ జరగనుంది. ఈ నేపథ్యంలో ఐపిఎల్‌లో ఇప్పటివరకు నమోదైన అత్యంత చెత్త రికార్డులను ఒకసారి పరిశీలిస్తే ఐపిఎల్‌లో అతితక్కువ పరుగులు: ఐపిఎల్‌ అంటేనే పరుగుల వరదకు కేరాఫ్‌ అడ్రస్‌, బీకర బ్యాటింగ్‌ లైనఫ్‌ కటిని రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగుళూరు జట్టు ఐపిఎల్‌లో అత్యంత తక్కువ 49 పరుగులకే ఆలౌటై చెత్తరికార్డును మూటగట్టుకుంది. 2017లో ఈడెన్‌ గార్డెన్స్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆర్‌సిబి ఈ రికార్డును నమోదు చేసింది. మొదట బ్యాటింగ్‌ చేసిన స్వల్ఫ లక్ష్యాన్ని ప్రత్యర్థికి నిర్ధేశించింది. అనంతరం చేదనకు దిగిన ఆర్‌సిబి కేవలం 49 పరుగులు మాత్రమే చేసి చేతులెత్తేసింది. ఇందులో ఏ ఒక్క బ్యాట్స్‌మెన్‌ కూడా రెండంకెల స్కోరు చేయలేకోవడం గమనార్హం. దీంతో చేసేదిలేక 10 ఓవర్లలోపే ఆ జట్టు కుప్పకూలింది.
అత్యధిక ఎక్స్‌ట్రాలు : 2008లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో డెక్కన్‌ చార్టర్స్‌ జట్టు 28 అదనపు పరుగులు ఇచ్చింది. ఐపిఎల్‌ చరిత్రలో ఇవే అత్యధిక అదనపు పరుగులు.
అత్యధికసార్లు డకౌట్‌: ఐపిఎల్‌లో ఇప్పటివరకు అత్యధికంగా 13సార్లు హర్భజన్‌సింగ్‌ డకౌటయ్యాడు.
అత్యధిక ఓటములు: 11 సీజన్లలో మొత్తం 91సార్లు ఢిల్లీ డేర్‌డెవిల్స్‌ ఓటమిపాలైంది. మరే ఇతర జట్లు ఇన్ని ఓటములు చవిచూడలేదు.
అత్యధిక పరుగులు ఇచ్చిన బౌలర్‌ :సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ బౌలర్‌ బసిల్‌ థంపి ఒకే స్పెల్‌లో (నాలుగు ఓవర్ల) అత్యధికంగా 70 పరుగులు ఇచ్చాడు.

https://www.vaartha.com/news/sports/
మరిన్ని తాజా క్రీడా వార్తల కోసం క్లిక్‌ చేయండి: