అంపైర్లతో వాగ్వాదం ఎంతమాత్రం సరైంది కాదు: బట్లర్‌…

butler run out
butler run out


జైపూర్‌: ఐపిఎల్‌లో రాజస్థాన్‌ రాయల్స్‌తో మ్యాచ్‌ సందర్భంగా చెన్నై సూపర్‌కింగ్స్‌ కెప్టెన్‌ ఎంఎస్‌ ధోని డగౌట్‌ నుంచి ఫీల్డ్‌లోకి వెళ్లి మరీ నో బాల్‌ వివాదంపై అంపైర్లపై ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. అయితే ఇలా మైదానంలోకి వెళ్లి అంపైర్లతో వాగ్వాదానికి దిగడం ఎంతమాత్రం సరైనది కాదని రాజస్థాన్‌ రాయల్స్‌ ఆటగాడు జోస్‌ బట్లర్‌ పేర్కొన్నాడు. ఒకసారి మైదానం విడిచి వెళ్లిపోయిన క్రికెటర్‌…మళ్లీ పిచ్‌లోకి వచ్చి వివరణ కోరడం తన వరకు అయితే కచ్చితంగా తప్పేనన్నాడు. ఆ సమయంలో నేను బౌండరీ లైన్‌ వద్ద పీల్డింగ్‌ చేస్తున్నా. అసలు ఏమి జరిగింది అనేది నాకు పూర్తిగా తెలియదు. అయినప్పటికీ డగౌట్‌ నంచి ధోని వచ్చి అంపైర్లను ప్రశ్నించడం సరైన చర్య కాదు. ఇరు జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌ ఉత్కంఠభరితంగా సాగింది. అందులోధోని ఇలా ఫీల్డ్‌లోకి రావడం గేమ్‌లోని మరింత వేడి పుట్టించింది. చివరకు మ్యాచ్‌ను చేజార్చుకోవడం నిరాశ కల్గించింది. గెలుస్తామనుకున్న మ్యాచ్‌లో పరాజయం వెక్కిరించింది. ఈ సీజన్‌లో వరుస పరాజయాలు చవిచూడటం మాజట్టును తీవ్ర నిరాశకు గురిచేస్తోందని బట్లర్‌ పేర్కొన్నాడు.

మరిన్నీ తాజా క్రీడా వార్తల కోసం క్లిక్‌ చేయండి : https://www.vaartha.com/news/sports/