తొలి టెస్టులో నమోదైన రికార్డులు ఇవే

Team India

మూడు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా విశాఖలో దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి టెస్టులో భారత్‌ 203 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. బ్యాట్స్‌మెన్‌ విజృంభణకు తోడు బౌలర్ల కృషి తోడవ్వడంతో అచ్చొచ్చిన వైజాగ్‌ పిచ్‌పై భారత్‌ రెండో టెస్టు విజయాన్ని నమోదు చేసింది. చివరి రోజు పేసర్‌ మహ్మద్‌ షమీ (5/35), రవీంద్ర జడేజా (4/87) రాణించడంతో దక్షిణాఫ్రికా రెండో ఇన్నిం గ్స్‌లో 191 పరుగులకు ఆలౌటయ్యింది. భారత్‌ భారీ విజ యాన్ని అందుకుని 3 టెస్టుల ఫ్రీడమ్‌ సిరీస్‌లో 1-0తో ముం దంజలో నిలిచింది. సొంతగడ్డపై ఏడాది జరిగిన టెస్టులో భారత్‌ అద్భుత ఆటతో ఆకట్టుకుంది.
ఆటగాళ్ల రికార్డులు…
్ద ఒక టెస్టుల్లో ఓపెనర్‌గా వచ్చి రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ సెంచరీ చేసిన తొలి క్రికెటర్‌గా రోహిత్‌ రికార్డు సృష్టించాడు.
్ద ఒక టెస్టులో రెండు సెంచరీలు బాదిన ఆరో బ్యాట్స్‌మెన్‌ గా రోహిత్‌ శర్మ రికార్డు సృష్టించాడు. ఇంతకుముందు విజ §్‌ుహజారే, సునీల్‌ గవాస్కర్‌, రాహుల్‌ ద్రావిడ్‌, విరాట్‌ కోహ్లీ, అజింక్యా రహానె సాధించారు.
్ద మయాంక్‌, రోహిత్‌ 300లకు పైగా తొలి వికెట్‌ భాగ స్వామ్యం సాధించి రికార్డు సృష్టించారు. భారత్‌, సౌతాఫ్రికా టెస్టు మ్యాచ్‌లో అత్యధిక తొలివికెట్‌ భాగస్వామ్యం సాధిం చిన ఓపెనర్లుగా మయాంక్‌, రోహిత్‌ రికార్డు సృష్టిం చాడు. ఇంతకుముందు 1996లో గ్యారీ కిర్‌స్టన్‌, హడ్సన్‌ 236 పరుగుల రికార్డును భారత్‌ ఓపెనింగ్‌ జోడీ బద్దలు కొట్టింది.
్ద మయాంక్‌ అగర్వాల్‌ స్వదేశంలో ఆడుతున్న తొలి టెస్టు లోనే సెంచరీని డబుల్‌గా మలిచాడు. దిలీప్‌ సర్ధే శా§్‌ు, వినోద్‌ కాంబ్లీ, కరణ్‌ నాయర్‌ల సరసన మయాంక్‌ చేరాడు.
్ద ఈ టెస్టు మ్యాచ్‌లో భారత్‌, దక్షిణాఫ్రికా జట్లు కలిపి అత్యధిక సిక్సర్లు (37)నమోదు చేశాయి. ఇంతకుముందు ఈ రికార్డు పాకిస్తాన్‌, న్యూజిలాండ్‌ (35 సిక్సర్లు) పేరిట ఉంది.
్ద ఆర్‌ అశ్విన్‌ 350 వికెట్ల క్లబ్‌లో చేరాడు. భారత్‌ తరపున అతి తక్కువ మ్యాచుల్లో అశ్విన్‌ ఈ ఫీట్‌ సాధించాడు.
్ద ఓ ఇన్నింగ్స్‌లో అత్యధికసార్లు 5 వికెట్లు సాధించిన బౌలర్‌గా అశ్విన్‌ రికార్డు సృష్టించాడు. అశ్విన్‌ కన్నా ముందు మురళీధరన్‌ 45సార్లు 5 వికెట్లు సాధించాడు.
్ద రవీంద్ర జడేజా 150 వికెట్లు సాధించిన మూడో లెప్టార్మ్‌ స్పిన్నర్‌గా రికార్డు సాధించాడు. జడేజా కన్నా ముందు రం గనా హెరాత్‌, డేనియల్‌ వెటోరీ ఉన్నారు.
్ద ఈ టెస్టు విజయంలో భారత్‌ ప్రపంచ టెస్టు ఛాంపియన ్‌షిప్‌లో 160 పాయింట్లతో అగ్రస్థానంలో ఉంది.

తాజా చెలి వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/specials/women/