పంత్‌ స్టపింగ్‌పై చాహల్‌ రియాక్ట్‌

Rishabh Pant
Rishabh Pant

రాజ్‌కోట్‌: భారత్‌-బంగ్లా జట్ల మధ్య జరిగిన రెండో టీ20లో టీమిండియా ఘన విజయం సాధించింది. కాగా ఈ మ్యాచ్‌లో భారత వికెట్‌ కీపర్‌ రిషబ్‌ పంత్‌ మాత్రం వార్తల్లోకెక్కాడు. బంగ్లాదేశ్‌ ప్లేయర్‌ లిటన్‌ దాస్‌ బ్యాటింగ్‌ చేస్తున్న సమయంలో అతను ఓ బంతిని ఆడటానికి ముందుగా వచ్చి స్టంపౌట్‌ కాగా, పంత్‌ చేతులు వికెట్స్‌ని దాటి ముందుకు రావడంతో అంపైర్‌ నోబాల్‌గా నిర్ణయించాడు. దీంతో స్టంపౌట్‌ నుంచి తప్పించుకున్న లిటన్‌ దాస్‌ 8 ఓవర్‌లోనే మళ్లీ పంత్‌ చేతిలో రనౌటయ్యాడు. మ్యాచ్‌ అనంతరం చాహల్‌ మాట్లాడుతూ.. ఎవరూ కావాలని తప్పులు చేయరని, లిటన్‌ దాస్‌ను ఔట్‌ చేయాలనే ప్రయత్నంలో అలా జరిగింది ఇదంతా ఆటలో భాగమేనన్నారు. తాను కూడా ఒక్కోసారి క్యాచ్‌లను వదిలేస్తానని, అంతా తమ దురదృష్టం పంత్‌పై తమకు ఎలాంటి కోపం లేదని చెప్పుకొచ్చారు.
తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/