కమిటీ గడువు ముగిసింది.. ఇక కొనసాగలేరు

Sourav Ganguly
Sourav Ganguly

ముంబయి: ఎంఎస్‌కె ప్రసాద్‌ పదవి కాలం ముగిసిందని, ఇక ఆయన కొనసాగలేరని బిసిసిఐ అధ్యక్షుడు సౌరవ్‌ గంగూలీ తెలిపారు. బిసిసిఐ వార్షిక సర్వసభ్య సమావేశంలో జస్టిస్‌ లోధా కమిటీ సంస్కరణలకు మార్పులు చేశారు. మరీ ముఖ్యంగా మూడేళ్ల కూలింగ్‌ ఆఫ్‌ పిరియడ్‌పై కూడా. సమావేశం అనంతరం గంగూలీ మీడియాతో మాట్లాడుతూ.. ఎంఎస్‌కె ప్రసాద్‌ ఇంత కాలం తమ విధులను చక్కగా నిర్వంచారు. అయితే ఆయన నేతృత్వంలో సెలక్షన్‌ కమిటీ పదవీకాలం ముగియడంతో ఇకమీదట వారు కొనసాగలేరు అని గంగూలీ తెలిపారు. అంతేకాకుండా సెలక్టర్ల విషయంలో కొత్త విధానం ప్రవేశపెట్టేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు. ప్రతి ఏడాది సెలక్టర్లను నియమించడం సరైన పద్ధతి కాదని గంగూలీ అభిప్రాయపడ్డారు. కాగా బిసిసిఐ రాజ్యాంగం ప్రకారం సెలక్షన్‌ కమిటీకి కాలపరిమితి నాలుగేళ్లు మాత్రమే ఉంటుంది. కమిటీ చైర్మన్‌ ఎంఎస్‌కె ప్రసాద్‌, కమిటీ సభ్యుడు గగన్‌ ఖోడా 2015లోనే బాధ్యతలు స్వీకరించారు. అయితే తాజా దాదా వ్యాఖ్యలను బట్టి చూస్తే కమిటీ సభ్యులు కొనసాగే అవకాశం లేనట్లు అర్థం అవుతుంది.

తాజా ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/