తెలంగాణ స్విమ్మర్ల సత్తా

GHMC swimming pool
GHMC swimming pool

హైదరాబాద్‌: జాతీయ అక్వాటిక్‌ చాంపియన్‌షిప్‌లో తెలంగాణ స్విమ్మర్లు సత్తా చాటారు. శనివారం సికింద్రాబాద్‌లోని జిహెచ్‌ఎంసి స్విమ్మింగ్‌పూల్‌లో 80ప్లస్‌ విభాగంలో నిర్వహించిన 400 మీటర్ల ఫ్రీస్టయిల్‌ పోటీల్లో సి.రాజ్‌కుమార్‌ (తెలంగాణ) విజేతగా నిలిచాడు. తెలంగాణకే చెందిన ఓం అవతార్‌ రెండో స్థానంలో నిలిచాడు. 35-39 ఏళ్ల విభాగంలో జరిగిన 100 మీటర్ల బ్రెస్ట్‌స్ట్రోక్‌తో అజిత్‌ సుదర్శన్‌(తెలంగాణ) తొలి స్థానంలో నిలువగా త్రిపథ్‌ ప్రశాంత్‌ (మహారాష్ట్ర), చంద్రకాంత్‌ (మహారాష్ట్ర) వరుసగా రెండు, మూడు స్థానాల్లో నిలిచారు. పురుషుల 55-54 ఏళ్ల విభాగంలో బ్యాక్‌స్ట్రోక్‌లో కె. సురేంద్ర(తెలంగాణ), జక్రియా అలీఖాన్‌ (ఎపి), ఉత్తమ్‌పాటిలో (మహారాష్ట్ర) వరుసగా తొలి మూడు స్థానాల్లో నిలిచారు. పురుషుల 30-34 ఏళ్ల విభాగంలో బ్యాక్‌స్ట్రోక్‌లో మీనాక్షి జైన్‌(తెలంగాణ) తొలి స్థానంలో నిలువగా.. సోనాలీ మనోహర్‌ (మహారాష్ట్ర), సప్నా యాదవ్‌(మహారాష్ట్ర) వరుసగా రెండు,మూడు స్థానాల్లో నిలిచారు. ఈ పోటీల్లో 12 రాష్ట్రాలకు చెందిన 650మందికిపైగా స్విమ్మర్లు పాల్గొన్నారు.
తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/business/