కొత్త జెర్సీలను ధరించిన కోహ్లీసేన

Team-India-New-Jerseys
Team-India-New-Jerseys

లండన్‌: ప్రపంచకప్‌లో భాగంగా ఆదివారం ఇంగ్లాండ్‌-భారత్‌ మధ్య జరిగే మ్యాచ్‌లో కోహ్లీసేన కొత్త జెర్సీలను ధరించనుంది. అయితే ప్రపంచకప్‌లో ఇప్పటివరకు ఈ రెండు జట్లూ నీలిరంగు జెర్సీలను ధరిస్తూ ఆడుతున్న సంగతి తెలిసిందే. దీంతో ఐసీసీ నిబంధనల ప్రకారం ఈ రెండు జట్లు తలపడే మ్యాచ్‌లో టీమిండియా జెర్సీలు మారాయి. ఇందులో ముదురు నీలం రంగుతో పాటు నారింజ రంగు కూడా జోడించారు. కాగా కొత్తగా ఆ జెర్సీలను ధరిస్తూ కోహ్లీసేన తాజాగా ఫొటోలకు ఫోజులిచ్చింది. రేపు జరగబోయే మ్యాచ్‌లో ఎలా కనిపిస్తారో తెలియజేస్తూ క్రికెట్‌ ప్రపంచకప్‌ ట్విటర్‌లో ఈ ఫొటోలను షేర్‌ చేసింది.


తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/business/