బౌలర్లే గెలిపించారు

Team india bowling
Team india bowling

వరల్డ్ కప్ లో భాగంగా ఆస్ట్రేలియాపై ఈ రోజు జరిగిన మ్యాచ్ లో భారత్ విజయంలో బౌలర్లదే ప్రధాన పాత్ర. ముఖ్యంగా బుమ్రా, భువనేశ్వర్ లో పదునైన లైన్ అండ్ లెంగ్త్ లో బౌలింగ్ చేయడంతో ఆస్ట్రేలియన్ బ్యాట్స్ మెన్ కు పరుగులు రాబట్టడం కష్టంగా మారింది. భువనేశ్వర్ పది ఓవర్లు బౌల్ చేసి 50 పరుగులిచ్చి మూడు వికెట్లు పడగొట్టగా, బుమ్రా పది ఓవర్లు వేసి 61 పరుగులిచ్చి మూడు వికట్లు పడగొట్టాడు. అలాగే చాహల్ తన కోటా పది ఓవర్లలో 62 పరుగులిచ్చి రెండు వికెట్లు పడగొట్టాడు. ఫించ్ రనౌట్ అయ్యాడు.