సౌథాంప్టన్‌ చేరుకున్న భారత్‌ ఆటగాళ్లు

Team-India
Team-India

సౌథాంప్టన్‌: ప్రపంచకప్‌-2019 మరికొద్ది గంటల్లో ప్రారంభంకానుంది. ఈ సందర్భంగా భారత్‌ ఆటగాళ్లు గతరాత్రి సౌథాంప్టన్‌ చేరుకున్నారు. ఓవల్‌ వేదికగా తొలిపోరులో ఆతిథ్య ఇంగ్లాండ్‌.. దక్షిణాఫ్రికాతో తలపడనుంది. ఇక టీమిండియా తొలి మ్యాచ్‌ జూన్‌ 5న దక్షిణాఫ్రికాతో సౌథాంప్టన్‌ వేదికగా ఆడనుంది. కాగా మంగళవారం బంగ్లదేశ్‌తో జరిగిన రెండో వార్మప్‌ మ్యాచ్‌లో 95 పరుగుల తేడాతో ఘన విజయం సాధించి ప్రపంచకప్‌లోకి ఘనంగా అడుగుపెట్టబోతోంది.


తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/