సురేశ్‌ రైనా రికార్డు సేఫ్‌…

Suresh Raina
Suresh Raina

హైదరాబాద్‌: ముంబై ఇండియన్స్‌ సారథి రోహిత్‌ శర్మ గాయం కారణంగా 11ఏళ్ల తర్వాత ఓ ఐపిఎల్‌ మ్యాచ్‌కు దూరమయ్యాడు. తొడ కండరాలు పట్టేడయంతో బుధవారం కింగ్స్‌ పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌కు రోహిత్‌ శర్మ దూరమైన విషయం తెలిసిందే. 2011 నుంచి ముంబై ఇండియన్స్‌ తరుపున ఆడుతున్న రోహిత్‌ వరుసగా 133 మ్యాచ్‌ల తర్వాత మొదటిసారి బరిలోకి దిగలేదు. దీంతో చెన్నై సూపర్‌కింగ్స్‌ స్టార్‌ బ్యాట్స్‌మెన్‌ రైనా పేరిట ఉన్న రికార్డు పదిలంగా ఉంది. రైనా సిఎస్‌కె తరుపున వరుసగా 134 మ్యాచ్‌లు ఆడాడు. ఇప్పటివరకు ఐపిఎల్‌లో ఓ జట్టు తరుపున వరుసగా అత్యధిక మ్యాచ్‌లు ఆడిన ఆటగాడిగా రైనా రికార్డు సాధించాడు. అయితే ఈ రికార్డు సమీపంలోకి వచ్చిన రోహిత్‌ శర్మ 133వ మ్యాచ్‌ దగ్గరే ఆగిపోయాడు. దీంతో రైనా రికార్డు భద్రంగా ఉంది. అప్పట్లో ఏ ఆటగాడు కూడా రైనా రికార్డును అధిగమించే అవకాశం లేదు. ఇక ఐపిఎల్‌లో రోహిత్‌ మ్యాచ్‌కు దూరం కావడం ఇది రెండోసారి మాత్రమే. 2011 నుంచి ముంబై ఇండియన్స్‌ తరుపున ఆడుతున్న రోహిత్‌ వరుసగా 133 మ్యాచ్‌ల తర్వాత మొదటిసారి బరిలోకి దిగలేదు. అంతకుముందు దక్కన్‌ చార్టర్స్‌ తరుపున ఆడిన మూడేళ్లలో అతను ఒక మ్యాచ్‌ ఆడలేదు. కీలక ప్రపంచకప్‌ ముందు ప్రధాన బ్యాట్స్‌మెన్‌ రోహిత్‌ శర్మకు ‘ఐపిఎల్‌ గాయం కావడం టీమిండియా శిబిరాన్ని కలవరపాటుకు గురిచేసింది. బిసిసిఐ కూడా ప్రత్యేక దృష్టి సారించినట్లు తెలుస్తోంది. అయితే రోహిత్‌ గాయంపై ముంబై ఇండియన్స్‌ ఓ ప్రకటన విడుదల చేసింది. రోహిత్‌ గాయం తీవ్రమైందేమీ కాదని….ప్రపంచకప్‌కు ముందు రిస్క్‌ చేయడం ఎందుకని ముందు జాగ్రత్తగా పంజాబ్‌ మ్యాచ్‌కు విశ్రాంతినిచ్చామని తెలిపింది.

మరిన్నీ తాజా క్రీడా వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/sports/