ట్రంప్‌ను కలిసిన సునీల్‌ గవాస్కర్‌

Sunil Gavaskar, Donald Trump
Sunil Gavaskar, Donald Trump

వాషింగ్టన్‌: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ను క్రికెట్‌ దిగ్గజ ఆటగాడు సునీల్‌ గవాస్కర్‌ కలిశారు. ఓ చారిటీ ఫౌండేషన్‌ నిధుల సేకరణలో భాగంగా ట్రంప్‌తో గవాస్కర్‌ సమావేశమయ్యారు. పుట్టుకతోనే గుండె సంబంధిత వ్యాధి బారిన పడ్డ చిన్నారులకు ఉచిత ఆపరేషన్లు ఏర్పాటు చేసేందుకు నిధులు సేకరణలో భాగంగా న్యూయార్క్‌లో ట్రంప్‌ను గవాస్కర్‌ కలిశారు. ఈ మేరకు చారిటీ చేసే సేవలను ట్రంప్‌కు తెలిపారు. కామెంటేటర్‌గా వ్యవరిస్తున్న గవాస్కర్‌ ఖాళీ సమయాన్ని నిధుల సేకరించేందుకు వినియోగిస్తున్నారు.


తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/business/