ఫించ్‌ సెంచరీ, స్మిత్‌ హాఫ్‌ సెంచరీ

steve smith
steve smith, australia batsman

లండన్‌: ఆస్ట్రేలియా ఓపెనర్‌ అరోన్‌ ఫించ్‌ సెంచరీతో చెలరేగాడు. శ్రీలంక బౌలర్లపై విరుచుకుపడుతూ సెంచరీ పూర్తి చేశాడు. 97 బంతుల్లోనే శతకం బాదాడు. ప్రస్తుతం ప్రపంచకప్‌లో సెంచరీ బాదిన తొలి కెప్టెన్‌గా అరోన్‌ ఫించ్‌ నిలిచాడు. ఖ్వాజా ఔటైన తర్వాత స్మిత్‌ వచ్చాడు. స్మిత్‌ కూడా నెమ్మదిగా ఆడుతూ హాఫ్‌ సెంచరీ పూర్తి చేశాడు. ఆసీస్‌ జట్టు 38 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 219 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజులో ఆరోన్‌ ఫించ్‌(125) ,స్టీవెన్‌ స్మిత్‌(50)లు ఉన్నారు.

తాజా కెరీర్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/specials/career/