అరుదైన రికార్డుకు చేరువలో స్మిత్‌…

steve smith
steve smith


లండన్‌: ఆస్ట్రేలియా ఆటగాడు స్టీవ్‌స్మిత్‌ అరుదైన రికార్డుకు చేరువలో ఉన్నాడు. ఒకే సిరీస్‌లో నాలుగు మ్యాచ్‌లు ఆడిన అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా వెస్టిండీస్‌ దిగ్గజం వివ్‌రిచర్డ్స్‌ రికార్డు సృష్టించాడు. 1976లో ఇంగ్లాండ్‌తో జరిగిన సిరీస్‌లో అతడు 829 పరుగులతో రికార్డు నెలకొల్పాడు. అనారోగ్య కారణంతో ఐదు టెస్టుల సిరీస్‌లో రిచర్డ్స్‌ నాలుగు మ్యాచ్‌లు మాత్రమే ఆడాడు. ఈ జాబితాలో భారత ఆటగాడు సునీల్‌ గవాస్కర్‌ 774 పరుగులతో రెండో స్థానంలో నిలిచారు. గవాస్కర్‌ తర్వాత స్థానంలో గ్రాహమ్‌ గూచ్‌ (752), బ్రియన్‌ లారా(688) ఉన్నారు. రిచర్డ్స్‌ పేరిట ఉన్న 42ఏళ్ల రికార్డును బద్దలు కొట్టడానికి స్మిత్‌కు మరో 159 పరుగులు అవసరం. బాల్‌ టాంపరింగ్‌ వివాదంతో ఏడాదిపాటు నిషేధానికి గురైన స్మిత్‌ యాషెస్‌ సిరీస్‌తో టెస్టు క్రికెట్‌లో తిరిగి అడుగుపెట్టాడు. పునరాగమనం తర్వాత అతడు అద్వితీయమైన ఫామ్‌ను కొనసాగిస్తున్నాడు. ప్రస్తుతం ఇంగ్లాండ్‌తో జరుగుతున్న యాషెస్‌ సిరీస్‌లో మూడు మ్యాచ్‌లు ఆడిన అతడు 134.20సగటుతో 671 పరుగులు చేశాడు. నాలుగో టెస్టులో ద్విశతకంతో జట్టును విజయతీరాలకు చేర్చాడు. సూపర్‌ఫామ్‌ను కొనసాగిస్తున్న అతడు కోహ్లీని అధిగమించి 937 రేటింగ్‌ పాయింట్లతో టెస్టుల్లో తొలి ర్యాంకును దక్కించుకొన్నాడు. ఐదు టెస్టుల సిరీస్‌లో ఇంగ్లాండ్‌పై ఆసీస్‌ 2-1తో పైచేయి సాధించింది.

తాజా క్రీడా వార్తల కోసం క్లిక్‌ చేయండి.. https://www.vaartha.com/news/sports/