జులై 20 నుంచి ప్రొ కబడ్డీ లీగ్‌ సీజన్‌-7

pro kabaddi league
pro kabaddi league


ప్రొ కబడ్డీ లీగ్‌ (పికెఎల్‌) ఏడవ సీజన్‌కు ముహూర్తం ఖరారైంది. ఈ ఏడాది జులై 20న ప్రారంభమవుతుందని లీగ్‌ నిర్వాహకులు ఓ ప్రకటనలో వెల్లడించారు. ఈ సీజన్‌లో మ్యాచ్‌లు రాత్రి 7.30 గంటలకు ఆరంభమవుతాయని తెలిపారు. ఈ సీజన్‌లో మొత్తం 12 జట్లు పాల్గొన్నాయి. స్టార్‌ రైడర్లు రాహుల్‌ చౌదరి, సిద్దార్ద్‌ దేశా§్‌ు, మోను గోయత్‌, సందీప్‌ నర్వాల్‌ వంటి పలువురు ఈ సీజన్‌లో కొత్త జట్లకు ఆడుతున్నారు.
బెంగళూరు బుల్స్‌ డిఫెండింగ్‌ ఛాంపియన్‌గా బరిలోకి దిగనుంది. గత సీజన్‌-6లో స్టార్‌ రైడర్‌ అజ§్‌ు ఠాకూర్‌ నేతృత్వంలోని బెంగళూరు బుల్స్‌ విజేతగా నిలిచింది. గుజరాత్‌ ఫార్చూన్‌ జెయింట్స్‌తో జరిగిన ఫైనల్‌ మ్యాచ్‌లో 38-33తో తేడాతో బెంగళూరు విక్టరీ సాధించి కప్‌ గెలిచింది.

తాజా హీరోల ఫోటోగ్యాలరీల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/photo-gallery/actors/