ఫైనల్‌కు చేరిన శ్రీవల్లి

Sri Valli
Sri Valli

హైదరాబాద్‌: తమిళనాడులో జరుగుతున్న జాతీయ జూనియర్‌ క్లే కోర్ట్‌ టెన్నిస్‌ చాంపియన్‌షిప్‌ టోర్నమెంట్‌లో తెలంగాణ అమ్మాయి శ్రీవల్లి రష్మిక ఫైనల్‌కు చేరి అదరగొట్టింది. శుక్రవారం జరిగిన సెమీఫైనల్‌ మ్యాచ్‌లో శ్రీవల్లి 6జ3, 7జ5తో టోర్నీ ఎనిమిదో సీడ్‌ క్రీడాకారిణి సారా దేవ్‌ (పంజాబ్‌)ను చిత్తు చేసి తుది పోరుకు అర్హత సాధించింది. ఆట ఆద్యంతం అద్భుతంగా ఆడిన శ్రీవల్లి వరుస సెట్లల్లో ప్రత్యర్థిని చిత్తు చేసింది.

తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/business/