22 ఓవర్లలో 4 వికెట్లు నష్టానికి 146 పరుగులు

AFGHANISTAN vs SRILANKA
AFGHANISTAN vs SRILANKA

కార్డిఫ్‌: వన్డే ప్రపంచకప్‌లో తమ తొలి మ్యాచ్‌లో విఫలమైన శ్రీలంక బ్యాట్స్‌మెన్‌ నేడు జోరుగా ఆడుతున్నారు. గత మ్యాచ్‌ తప్పిదాలను పునరావృతం కానీయకుండా దూకుడుగా ఆడుతూ స్కోరు బోర్డును పరుగులు పెట్టిస్తున్నారు. లంక సారథి దిముత్‌ కరుణరత్నె(30) జట్టు స్కోరు 92 వద్దే ఔటయ్యారు. ఆరంభం నుంచి కుశాల్‌ పెరీరా 42 బంతుల్లో 7 ఫోర్ల సాయంతో అర్ధశతకం పూర్తి చేశాడు.పెరీరాను ఔట్‌ చేసేందుకు ఆఫ్ఘాన్‌ శ్రమిస్తుంది. లహిరు తిరుమన్నె(25) నబీ బౌలింగ్‌లో ఔటయ్యాడు. కుశాల్‌ మెండిస్‌(2), ఏంజెలో మాథ్యూస్‌(0)లు నబీ బౌలింగ్‌లో రెహమత్‌కు క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగారు. 22 ఓవర్లలో 4 వికెట్లు నష్టానికి 146 పరుగులు చేశారు. ప్రస్తుతం క్రీజులో కుశాల్‌ పెరీరా(65), ధనంజయ డి సెల్వా(0)లు ఉన్నారు.

తాజా క్రీడా వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/sports/