టాస్‌ గెలిచిన కివీస్‌, శ్రీలంక స్కోరు 51/3

NZ vs SL
NZ vs SL

కార్డిఫ్‌: ప్రపంచకప్‌ మెగాటోర్నీలో భాగంగా మూడో రోజు మ్యాచ్‌లో న్యూజిలాండ్‌-శ్రీలంక జట్లు తలపడనున్నాయి. కార్డిఫ్‌ వేదికగా మరి కాసేపట్లో ప్రారంభం కానున్న మ్యాచ్‌లో కివీస్‌ టాస్‌ గెలిచి బౌలింగ్‌ ఎంచుకుంది. కివీస్‌ మెగాటోర్నీలో విజయం సాధించాలని పట్టుదలతో ఉంది.
శ్రీలంక జట్టు బ్యాటింగ్‌ మొదలుపెట్టింది. 10 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 51 పరుగులు చేసింది. ఓపెనర్లుగా తిరమన్నే, కరుణారత్నేలు బరిలోకి దిగారు. తిరుమన్నె(4) హెన్రీ బౌలింగ్‌లో ఎల్‌బిడబ్లూ అయ్యాడు. ఆ తర్వాత కుశాల్‌ పెరేరా వచ్చాడు. 24 బంతుల్లో 29 పరుగులు చేసి హెన్రీ బౌలింగ్‌లో గ్రాండ్‌హోమ్‌కు క్యాచ్‌ ఇచ్చి ఔటయ్యాడు. కుశాల్‌ మెండిస్‌ తర్వాత బరిలోకి దిగి హెన్రీ బౌలింగ్‌లో గప్టిల్‌కు క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు. ఆ తర్వాత ధనుంజయ డె సిల్వా మైదానంలోకి వచ్చాడు. ప్రస్తుతం కరణరత్నే(12), డె సిల్వా(4)లు ఉన్నారు.

తాజా హీరోయిన్‌ల ఫోటోగ్యాలరీల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/photo-gallery/actress/