పదేళ్ల తర్వాత పాక్‌ గడ్డపై టెస్ట్‌ మ్యాచ్‌ ఆడనున్న శ్రీలంక

pak vs sri lanka
pak vs sri lanka

లాహోర్‌: పాకిస్థాన్‌లో టెస్ట్‌ క్రికెట్‌ మ్యాచ్‌ల నిర్వహణకు ఆ దేశ క్రికెట్‌ బోర్డు సమయాత్తమవుతోంది. పదేళ్లుగా ఆదేశంలో టెస్ట్‌ మ్యాచ్‌లు జరగలేదు. తాజాగా ఆ దేశంలో రెండు టెస్ట్‌ మ్యాచ్‌లు ఆడేందుకు తమ జట్టును పంపించేందకు శ్రీలంక క్రికెట్‌ బోర్డు ఓకే చెప్పింది. దాదాపు దశాబ్ద కాలం తర్వాత స్వదేశంలో పాక్‌ అభిమానులు సుదీర్ఘ ఫార్మాట్‌ను ఆస్వాదించనున్నారు. అయితే సెప్టెంబర్‌లో లంక, పాక్‌..ద్వైపాక్షిక టీ20, వన్డే సిరీసుల్లో తలపడనున్నాయి కాగా పాకిస్థాన్‌ క్రికెట్‌కు ఇదో నమ్మశక్యం కాని వార్త అని ప్రపంచంలోని ఇతర దేశాల మాదిరిగానే ఈ దేశం సురక్షితం, భద్రతమైందన్న విశ్వాసం పెరుగుతోందని సుదీర్ఘ ఫార్మాట్‌ కోసం జట్టును పంపించేందుకు అంగీకరించిన శ్రీలంక క్రికెట్‌ బోర్డుకు కృతజ్ఞతలు అని పీసీబీ డైరెక్టర్‌ జకీర్‌ ఖాన్‌ తెలిపారు. కాగా 2009లో శ్రీలంక జట్టు ఆ దేశంలో పర్యటిస్తున్న సమయంలో బాంబుదాడి జరిగింది అప్పటినుంచి పాకిస్థాన్‌లో ఏ దేశమూ పర్యటించలేదు తాజాగా శ్రీలంక జట్టే మళ్లీ పాక్‌లో పర్యటించడానికి సిద్ధమైంది. ఇంకా డిసెంబర్‌ 11 నుంచి 15 వరకు రావల్పిండి వేదికగా తొలి టెస్ట్‌ మ్యాచ్‌, అదేనెల 19 నుంచి 23 వరకు కరాచీ వేదికగా రెండో టెస్ట్‌ మ్యాచ్‌ను అతిథ్య జట్టుతో ఆడనుంది.
తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/telangana/