మ్యాచ్‌ చేజారినందుకు సన్‌రైజర్స్‌ కోచ్‌ కన్నీళ్లు

tom moody
tom moody, SRH coach

విశాఖపట్టణం: రాత్రి ఢిల్లీ క్యాపిటల్స్‌, సన్‌రైజర్స్‌ మధ్య జరిగిన మ్యాచ్‌లో తృటిలో సన్‌రైజర్స్‌ చేతి నుంచి గెలుపు చేజారిపోవడంతో సన్‌రైజర్స్‌ ప్రధాన కోచ్‌ టామ్‌ మూడీ కన్నీళ్లు పెట్టుకున్నాయి. ఢిల్లీ గెలవాలంటే 18 బంతుల్లో 34 పరుగులు కావాలి. అప్పటికే వికెట్లు వరుసగా పడుతుండడంతో సన్‌రైజర్స్‌దే విజయం అనుకున్నారంతా. కాని థంపీ వేసిన 18వ ఓవర్లో ఢిల్లీ బ్యాట్స్‌మెన్‌ పంత్‌ వరుసగా 4,6,4,6 కొట్టేసరికి స్కోరు బోర్డు ఢిల్లీకి అనుకూలంగా మారింది. దీంతో మ్యాచ్‌ గెలుపు ఢిల్లీవైపు మొగ్గింది. పంత్‌ చెలరేగడంతో ఇంకో బంతి మిగిలిఉండగానే ఢిల్లీ విజయం సాధించింది. దీంతో సన్‌రైజర్స్‌ టోర్నీ నుంచి నిష్క్రమించక తప్పలేదు. ఐతే ఈ మ్యాచ్‌లో జట్టు కోచ్‌ టామ్‌ మూడీతో పాటు కెప్టెన్‌ విలియమ్సన్‌ భావోద్వేగానికి గురయ్యారు.

తాజా ఎన్నారై వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/nri/