దక్షిణాసియా క్రీడల్లో భారత్‌కు 312 పతకాలు

South Asian Games
South Asian Games

ఖాట్మండు: ముగిసిన దక్షిణాసియా క్రీడల్లో భారత్‌ మరోసారి తన సత్తా చాటుకుంది. నేపాల్‌ వేదికగా జరిగిన ఈ క్రీడలు మంగళవారంతో ముగిశాయి. రికార్డు స్థాయిలో పతకాలు సాధించిన భారత్‌ అగ్రస్థానంలో నిలిచింది. 2016 లో స్వదేశంలో నిర్వహించిన దక్షిణాసియా క్రీడల్లో అత్యధికంగా 309 పతకాలు సాధించగా, ఇప్పుడు ఏకంగా 312 పతకాలు(174 స్వర్ణాలు, 93 రజతం, 45 కాంస్య) 13వ సారి రికార్డును నెలకొల్పింది. ఇప్పటివరకు జరిగిన అన్ని క్రీడల్లోనూ పతకాల పట్టికలో భారత్‌దే అగ్రస్థానం కావడం విశేషం. కాగా ఆఖరి రోజున భారత్‌కు 17 పతకాలు రాగా వీటిలో బాక్సింగ్‌లోనే 12 స్వర్ణాలు వచ్చాయి. ఇంకా రెండు రజతాలు, ఒక కాంస్య పతకాన్ని భారత్‌ సాధించింది.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/